ఆంధ్రప్రదేశ్ లో EAPCET షెడ్యూల్‌ విడుదల అయింది. EAPCET షెడ్యూల్‌ ను ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ రిలీజ్ చేశారు.ఇక ఈ షెడ్యూల్‌ ప్రకారం.. జులై 4 వ తేదీ నుంచి 8 వ తేదీ దాకా ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష జరుగనుందని ఆయన ప్రకటన చేశారు.ఇక అలాగే.. జులై 11 వ తేదీ ఇంకా అలాగే 12వ తేదీలలో అగ్రి కల్చర్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.


ఇక ఈ పరీక్షల కోసం ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కూడా 134 పరీక్షా సెంటర్లను ఇంకా అలాగే తెలంగాణ రాష్ట్రంలో 4 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. అలాగే EAPCET ఎగ్జామ్స్ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 11 వ తేదీన విడుదల అవు తుందని… ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటన చేశారు.ఇక విద్యార్థులకు అనుగుణంగానే ఈ పరీక్ష తేదీలను ఫైనల్‌ చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నియమ నిబంధనాలను పాటిస్తూ.. ఈ ఎంసెట్‌ పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: