ఎక్సైజ్ తనిఖీల్లో పట్టుబడిన మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేయడం చూస్తుంటాం.. ప్రత్యేకించి రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ అక్రమ మద్యం పట్టుపడుతుంది. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ లక్షల విలువైన మద్యం బాటిళ్లను సెబ్ పోలీసులు ధ్వంసం చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తుంటారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బుల సంపాదన కోసం అత్యాశకు పోయి అక్రమ మార్గాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జైలుపాలు కావద్దని చెబుతుంటారు.


అంతవరకూ ఓకే.. కానీ.. పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేయడం ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. కొందరు పోలీసులు ఈ మద్యం బాటిళ్లను మీడియా సమక్షంలో రోడ్డు రోలరుతో తొక్కింస్తుంటారు. కొందరు మందుబాబులు ఈ దృశ్యాలు చూసి గుండెలు బాదుకుంటారు. కానీ ఇలా దొరికిన మద్యాన్ని నేల పాలు చేయడం కంటే.. వేలం వేయడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చవచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: