సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్‌కు గురయ్యారు.   ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం  తాజాగా సస్పెండ్‌ చేసింది. సుదీర్ఘ కాలం సస్పెన్షన్ తర్వాత ఆయన ఇటీవలే సర్వీసులో చేరడం విశేషం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో వల్ల ఏబీ వెంకటేశ్వరరావు.. 2022 మే 19న సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేశారు.


ఆయనకు సీఎస్ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ బాధ్యతలు అప్పగించారు.అప్పటి వరకూ ఆ శాఖను పర్యవేక్షిస్తున్న జి.విజయ్‌కుమార్‌ను రిలీవ్‌ చేసింది. అయితే.. ఇంతలోనే మరోసారి ఏబీవీని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు  పూర్వపరాలేంటంటే..
కొన్ని నెలల క్రితం పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్‌ అంశాలపై మీడియాతో ఏబీవీ మాట్లాడారు. అలా ఏబీవీ మీడియా సమావేశం నిర్వహించడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. సీఎస్‌ సమీర్‌ శర్మ ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. నోటీసు అందిన వారంలోపు వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని సీఎస్‌ ఇటీవలే హెచ్చరించారు. ఇంతలోనే ఏబీవీపై సస్పెన్షన్ వేటు పడింది కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి:

abv