ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులపై అమెరికా ఆంక్షలు విధిస్తోంది. అయితే రష్యా మాత్రం ఊరుకుంటుందా.. ఆ దేశం కూడా అమెరికా ప్రముఖులపై ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తో పాటు పలువురు అమెరికా మంత్రులపై రష్యా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో ఉన్నవారు రష్యాలోకి రాకుండా నిషేధం విధించింది.

ఇప్పుడు ఈ ఆంక్షలను రష్యా మరింత తీవ్రం చేసింది. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి, కుమార్తెను కూడా ఈ నిషేధిత జాబితాలో రష్యా చేర్చింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. రష్యా నేతలు, ప్రముఖులపై అమెరికా విధిస్తోన్న ఆంక్షలకు ఇది ప్రతిస్పందనగా తెలిపింది. తాజాగా 25 మంది అమెరికన్‌ పౌరులను స్టాప్‌ లిస్ట్‌  జాబితాలో చేర్చినట్టు రష్యా ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: