రష్యా చేస్తున్న దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్ కు బ్రిటన్ అండగా నిలుస్తోంది. ఉక్రెయిన్‌ సైనికులకు బ్రిటన్ ఆయుధ శిక్షణ అందిస్తోంది. రష్యా దాడుల్ని ఎలా దీటుగా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తోంది. రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్‌ను కాపాడేందుకు అమెరికా, ఇంగ్లండ్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్‌లోని సాలిస్‌బరీ ప్రాంతంలో ఉక్రెయిన్‌ సేనలకు బ్రిటిష్ సైన్యం శిక్షణ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


హౌవిర్జర్‌ లైట్‌ గన్‌లు ఎలా వాడాలో ఉక్రెయిన్ దళాలకు బ్రిటన్ సైన్యం అవగాహన కల్పిస్తోంది.  ఇంగ్లండ్ నుంచి ట్రైయినింగ్ పొందిన ఉక్రెయిన్‌ సేనలు తమ నైపుణ్యాల్ని మెరుగు పరుచుకుంటున్నాయి. రష్యాను మరింత దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నాయి. లాంగ్‌ రేంజ్ రాకెట్లను వినియోగించడంపై కూడా ఉక్రెయిన్‌ సేనలకు బ్రిటన్‌ సైన్యం శిక్షణ ఇస్తోంది. 50 మైళ్ల దూరంలోని శత్రు సేనల్ని మట్టుబెట్టే రాకెట్ లాంచర్లను కూడా బ్రిటన్ ఉక్రెయిన్ కు ఇస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: