ఇవాళ భారత్, చైనా  మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. తూర్పు లద్దాఖ్ లో సరిహద్దు వివాద పరిష్కారంపై భారత్ -చైనా చర్చించబోతున్నాయి. ఈ రెండు దేశాల సైనిక కమాండర్ల స్థాయి 16వ విడత చర్చలు ఇవాళ జరగనున్నాయి. భారత భూభాగంలోని చుషుల్ -మోల్దో ప్రాంతంలో ఈ చర్చలు జరగుతాయని తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్ లోని భారత భూభాగంలో చైనా దళాలు ఇటీవల తిష్ఠ వేశాయి. ఈ చైనా దళాలను వీలైనంత త్వరగా వెనక్కి మళ్లేలా చేయాలని భారత్ భావిస్తోంది. చర్చల్లో ఈ అంశంపై  భారత్ ఒత్తిడి చేసే అవకాశం ఉంది.


ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దుల వెంట శాంతి, సామరస్యం అవసరం అని భారత్ చెబుతోంది. ఈ సరిహద్దు వివాదంపై గత వారమే భారత్ , చైనా విదేశాంగ మంత్రులు జైశంకర్ , వాంగ్ యీ ఇండోనేషియాలోని బాలీలో చర్చించిన సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య సైనిక కమాండర్ల స్థాయి చర్చలు ఈ ఏడాది మార్చి 11న జరిగాయి. ఆ తర్వాత ఇవాళే మళ్లీ చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: