ఎస్సై.. ఓ ప్రాంతానికి పోలీసు అధికారి.. పోలీసులంటేనే కాస్త కటువుగా ఉంటారని అంతా అనుకుంటారు. కానీ అందరు పోలీసులు అలా ఉండరు. కొందరు మానవత్వం మూర్తీభవించి ఉంటారు. అలాంటి వారిలో కూకట్ పల్లి ఎస్సై శంకర్ ఒకరు. తాజాగా ఆయన చేసిన ఓ మంచి పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవాళ తెలంగాణలో ఎస్సై పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కానీ ఓ అభ్యర్థి అనుకోకుండా.. సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ఆ విషయం కూకట్ పల్లి ఎస్సై శంకర్ గమనించారు. ఎస్ఐ రాతపరీక్షకు ఆలస్యమవుతున్న అభ్యర్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరేలా కూకట్ పల్లి ఎస్ఐ శంకర్ జాగ్రత్తలుప తీసుకున్నారు. ఆ అభ్యర్థిని కానిస్టేబుల్ ను ద్విచక్ర వాహనంలో దింపాలని చెప్పారు. దీంతో ఆ అభ్యర్థి సకాలంలో పరీక్షకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అంతా ఎస్సై శంకర్ ను అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: