చాలా మందికి పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు ఉంటుంది. కానీ.. ఈ అలవాటు కొందరు పక్కింటివాళ్లను ఇబ్బంది పెడుతుంది. అంతే కాదు.. పక్కింటివాళ్ల జంతువులపై కొందరు కంప్లయింట్ కూడా చేస్తుంటారు. అయితే. ఇది సాధారణంగా కుక్కల గురించో.. ఇతర జంతువుల గురించో ఉంటుంది. కానీ.. ఓ వ్యక్తి చిలుక పై ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగించింది.
 
పొరుగింట్లో పెంచుకుంటున్న చిలుక తనను ఇబ్బంది పెడుతోందని మహారాష్ట్రలో ఓ వ్యక్తి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రామ చిలక అరుపులు, కీచులాటతో తనకు నిద్ర లేకుండా చేస్తోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహారాష్ట్ర పుణెలోని శివాజీనగర్ వాసి అక్బర్‌ అజ్మెర్‌ ఖాన్‌ చిలుకను పెంచుకుంటున్నాడు. దాని అరుపులు పొరుగింట్లో ఉండే సురేశ్‌ శిందే ఇబ్బంది పెడుతున్నాయట. చిలుక గోలకు తనకు సరిగా నిద్రపట్టడంలేదని శిందే పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై ఖడ్కీ పోలీసు స్టేషన్‌ అధికారి స్పందిస్తూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: