ఉక్రెయిన్  అధ్యక్షుడు జెలెన్ స్కీ... రష్యాను ఎదుర్కొంటున్న ధీశాలిగా ఇప్పుడు ప్రపంచం మొత్తం బాగా  పరిచయమైన పేరు. ఆయన తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉక్రెయిన్  అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మేరకు జెలెన్ స్కీ అధికార ప్రతినిధి ఫేస్ బుక్  పోస్టులో తెలిపారు. ఆయన అలా తెలిపినట్టు కీవ్  ఇండిపెండెంట్   పోర్టల్  ప్రచురించింది. ఇంతకీ ఏమైందంటే.. జెలెన్ స్కీ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. అలా ఈ ఈ ప్రమాదం జరిగినట్లు కీవ్ పోర్టల్ తెలిపింది.

ఈ ప్రమాదం తర్వాత ఉక్రెయిన్  అధ్యక్షుడు జెలెన్ స్కీని వైద్య బృందం పరీక్షించింది. అయితే ఆయనకు తీవ్రమైన గాయాలేమీ కాలేదని తెలిపిందని కీవ్  ఇండిపెండెంట్  పోర్టల్  ప్రకటించింది. అయితే ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఇది ప్రమాదమా.. ఆయనపై జరిగిన కుట్రా అన్నది తేల్చాలని దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: