హైదరాబాద్‌లోని బంజారా భవన్ వద్ద గిరిజన రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కాన్వాయ్ అడ్డుకునేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

అంతకు ముందు బంజారా, ఆదివాసీ భవన్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. వారు  తలెత్తుకునేలా భవనాలు నిర్మించామన్నారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ పేరుతో ప్రాంతం ఉన్నా.. అక్కడ బంజారాలకు చోటు లేదన్నారు. మహారాష్ట్రలో బంజారాలు బీసీల జాబితాలో ఉన్నారని..
దేశవ్యాప్త బంజారాలకు ఒకే స్థాయి రిజర్వేషన్లు ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు.  జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక ఏకీకృత విధానం తెస్తామన్నారు. త్వరలో పోడుభూముల సమస్య పరిష్కరిస్తామని.. ఉన్నత స్థానాల్లో ఉన్న గిరిజనులు తండాల్లో సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని కేసీఆర్ అన్నారు. బంజారా, ఆదివాసీలు తలెత్తుకునేలా భవనాలు నిర్మించామన్న సీఎం కేసీఆర్.. బంజారాలకు ఏ కష్టమొచ్చినా ఈ భవనం నుంచి ఆదుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: