ఏపీఐఐసీ.. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ.. ఈ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏపీఐఐసీ 50 వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ లోగో ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా సాగింది. ఆయనే లోగోను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రిని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండి జేవీఎన్‌. సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు కలిశారు.

పారదర్శక పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక వాడల అభివృద్దికి నిరంతరం కృషిచేయాలని సీఎం వారికి సూచించారు. రాష్ట్ర ప్రగతిలో ఎపీఐఐసీ  కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని  సీఎం జగన్ ఆకాంక్షించారు. సీఎం  ఇచ్చిన స్పూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తామని ఏపీఐఐసీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది పాటు నిర్వహించబోయే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను  ఏపీఐఐసీ అధికారుల బృందం ముఖ్యమంత్రికి వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: