డ్రగ్స్ బానిసలు విచక్షణ కోల్పోతారు. తాము ఏం చేస్తున్నారో వారికే తెలియని మాయలో ఉండిపోతారు. సమయానికి డ్రగ్స్ వారికి అందకపోతే.. ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారనేదానికి ఉదాహరణగా...దిల్లీలోని పాలమ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన కుటుంబంలోని నలుగురు కత్తిపోట్లతో చంపేశాడు. నిందితుడిని.... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కుటుంబంలో జరిగిన గొడవతో డ్రగ్స్ కు బానిసైన 25 ఏళ్ల యువకుడు కేశవ్ ... ఈ దురగతానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్  మానిపించేందుకు పునరావాస కేంద్రానికి వెళ్లి వచ్చిన తర్వాత కేశవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. నాయనమ్మ, తండ్రి, తల్లి, సోదరిని గొంతుకోసి హత్య చేశాడు. వారి మృత దేహాలపై అనేక సార్లు పదునైన ఆయుధంతో పొడిచినట్లు గాయాలయ్యాయి. అందరి మృతదేహాలు ఇంట్లోనే పడి ఉన్నాయి. పారిపోవడానికి యత్నించిన కేశవ్ ను బంధువులు పట్టుకుని పోలీసులు అప్పగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: