12 కోట్ల మంది రైతులకి కేంద్రం భరోసా డబ్బులు ఇస్తే ఏపీలో మాత్రం జగన్ బటన్ నొక్కినట్టు ఫోటోలకు దిగుతున్నారని బీజేపీ ఎంపి జీవిఎల్ నరసింహరావు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం దారుణంగా ఉందన్న బీజేపీ ఎంపి జీవిఎల్ నరసింహరావు.. దేశంలో డిజిటల్ ఇండియా అమలు జరుగుతుంటే ఏపీలో మాత్రం మద్యం దుకాణంలో నగర రహిత లావాదేవిలకు అవకాశం ఇవ్వకుండా నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

దేశం కోసం అనేక మంది పోరాటం చేస్తే ఒక్క గాంధీ కుటుంబమే అంత చేసినట్టు చెప్పుకుంటున్నారని జీవిఎల్ నరసింహరావు తెలిపారు. పీవీ నరసింహారావు పేరు చెప్పడానికి కుడా గాంధీ కుటుంబం ఇష్టపడదని జీవిఎల్ నరసింహరావు అన్నారు. దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం వాజ్ పేయ్ మాత్రమేనని జీవిఎల్ నరసింహరావు అన్నారు. యూపిఏ  ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలు జరిగాయని అందుకే ఆ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు జీవిఎల్ నరసింహరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: