సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. టీఎస్‌ఆర్టీసీ శుభ వార్త చెప్పింది. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే మంచి ఆఫర్ ప్రకటించింది. ఇలా చేస్తే తిరుగు ప్రయాణం పై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ 10 శాతం రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ పేర్కొంది.

వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. సంక్రాంతి పర్వదినం సందర్బంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని సంస్థ నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెబుతున్నారు. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని వారు కోరుతున్నారు. ఈ టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtconline.in ని సంప్రదించాలని ఆర్టీసీ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: