నేరస్థులే పాలకులైతే ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో పౌరహక్కులు ఎక్కడ ఉంటాయని పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు ప్రశ్నించారు. రాజ్య హింసను ప్రోత్సహించే చర్యలు దేనికి సంకేతమని ముప్పాళ్ల సుబ్బారావు ప్రశ్నించారు. పోలీసుల చేతకానితనం తోనే ఎమ్మెల్సీ ఆనంతబాబుకు బెయిల్ వచ్చిందని ముప్పాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అదనపు ఏజీని దిల్లీ పంపించి మరీ బెయిల్ ఇప్పించేందుకు సహకరించిందని ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.

ఆనంతబాబుకు బెయిల్ ఇప్పించేందుకు పోలీసులు-ప్రభుత్వం శక్తివంచన లేకుండా కలిసి కృషి చేసారని ముప్పాళ్ల సుబ్బారావు మండిపడ్డారు. ఏసీబీ, జేసీబీ, పీసీబీ సాయంతో ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని ముప్పాళ్ల సుబ్బారావు ధ్వజమెత్తారు. ప్రజలకు జవాదారీ తనంగా ఉండాల్సిన పోలీసులు ప్రభుత్వ పాలేగాళ్లమని చెప్పుకుంటున్నారని ముప్పాళ్ల సుబ్బారావు విమర్శించారు. ఐఏఎస్ లు అయ్యా ఎస్ అంటున్నారని పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP