కేంద్రంతో పాటు... దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనట. ఈ విషయం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. శాఖాల వారీగా విశ్లేషించినా అన్ని శాఖాల్లో తెలంగాణ ఉద్యోగులకే ఎక్కువగా వేతనాలు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గత ఏడాది 1 లక్ష 40వేల ఉద్యోగాలు ఇచ్చామమని... ఇపుడు 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఉద్యోగుల మెడిక్లైమ్ గురించి సీఎం కేసీఆర్ తో చర్చించామని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలో దాన్ని స్టార్ట్ చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు.


తమది ఉద్యోగుల, ప్రజల ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఉద్యమం లో డైరీ విడుదల అంటే ఉద్యమం గుర్తు వచ్చేదని మంత్రి హరీష్ రావు అన్నారు. జనవరి మొత్తం ఇదే పని ఉండేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఉద్యోగుల చిన్న సమస్యలు అన్ని రాసుకున్నానని...త్వరలో రామకృష్ణా రావు, డైరెక్టర్, మిమ్మల్ని పిలిచి మీటింగ్ పెడుతానని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

KCR