అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. టన్నెల్‌ను జాతికి అంకితం చేశారు. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లిలో అవుకు రెండో టన్నెల్‌ ను ప్రారంభించారు. అంతకుముందు సీఎం వైయస్‌ జగన్‌.. ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఆ తర్వాత నీటిని విడుదల చేసిన సీఎం జగన్ రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేశారు. ఈ టన్నెల్‌ ద్వారా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని అవకాశం లభిస్తుంది.

గాలేరు –నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించారు. ఈ డిజైన్‌ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం అయ్యింది. అవుకు సొరంగాల పనులకు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి పనులు చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు పనులు చేసింది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ రూ.145.86 కోట్లుతో టన్నెల్‌ 2 పనులను పూర్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: