కేసీఆర్‌ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని.. కాంగ్రెస్‌, భారాసకు తేడా లేకుండా పోయిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. గత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తూ.. అందరినీ జైళుకు పంపుతామని ప్రగల్భాలు పలికిన రేవంత్‌ రెడ్డి ఎంతమంది మీద కేసులు పెట్టారని నిర్మల్‌ భాజపా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణ కోరకుండా.. జ్యూడీష్యల్‌ విచారణ వేయడం వెనక అంతర్యమేంటని అన్నారు. 


పార్లమెంట్‌ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు డివైడ్‌ కాకుండా భారాసతో లోపాయికారీ ఓప్పందం చేసుకున్నారని భాజపా నేతలు ఆరోపించారు. అసదుద్ధీన్‌ ఓవైసీ దీనికి మధ్యవర్తిత్వం చేశారన్నారు. సీబీఐ విచారణ చేయడానికి ముఖ్యమంత్రికి వచ్చిన అడ్డంకి ఏంటని భాజపా నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr