ఎన్నికల నియమావళి అమలైన తరువాత కటౌట్లు తీసివేయాలని.. ఈ కటౌట్ లను రాజకీయ ఖర్చులు కింద పరిగణించాలి ఇది నిబంధన అని.. రాష్ట్రంలో ఎన్నికల నియమాలని అమలు చేయడంలో వైఫల్యాలకు ఇది నిదర్శనమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటున్నారు. రేషన్ వాహనాలపై, ధ్రువీకరణ పత్రాల మీద, పిల్లల స్కూల్ బ్యాగ్ మీద ముఖ్యమంత్రి చిత్రపటాలు ఉన్నాయంటున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. పంట పొలాల్లో వేసే రాళ్లపైనా చిత్రాలు ఉన్నాయని.. వీటన్నింటినీ ఎలా సవరిస్తారు ఎవరికీ అర్థం కాని విషయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనట్లు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాష్ట్రంలో ఎన్నికల నియామావళి అమలవుతుందన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా అధికారులు స్వతంత్రంగా ధైర్యంగా ఇప్పుడైనా వ్యవహరించాలన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి