ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయ్యన్న కు నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన అయ్యన్న పాత్రుడు.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఒకసారి ఎంపీగానూ  గెలిచిన అయ్యన్న పాత్రుడు.. పట్టభద్రుడు. అయ్యన్న పాత్రుడికి ఇప్పటి వరకూ అయిదు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది.


మంత్రిగా సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు భవనాలు, అటవీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు ఇప్పటి వరకూ అయ్యన్న పాత్రుడు నిర్వర్తించారు. 1983 నుంచి ఇప్పటివరకూ 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో  అయ్యన్న పాత్రుడు పోటీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ను పరుష పదజాలంతో తిట్టడం ద్వారా అయ్యన్న పాత్రుడు బాగా వార్తల్లోకెక్కారు. మరి ఇప్పుడు ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: