ఎక్కడో జరిగిన వ్యవహారానికి ఇంకెక్కడో ప్రభావం అంటే ఇదేనేమో. న్యూ జెర్సీ కేంద్రం గా పని చేస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకి చుక్కలు కనపడుతున్నాయి. న్యూజర్సీ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ, ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ఒకరిని భారత్ లో నియమించుకుని, ఐటీ సేవలందిస్తున్న కాగ్నిజంట్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ మొత్తం భారత ఐటీ రంగపైనే పడింది. తన గ్రోత్ అంచనాలని కాగ్నిజెంట్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తోంది.