మనదేశంలో కరెన్సీకి సంబంధించినంత వరకు సుప్రీమ్ అథారిటీస్ ఆర్‌బీఐ వద్దే ఉంటాయి. ఆర్‌బీఐ అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశ ఆర్థిక వ్యవస్థలో క్యాష్ సర్కులేషన్ నుంచి మొదలుకుని బ్యాంకింగ్ సర్వీసుల వరకు అన్నీ ఆర్‌బీఐ నిర్వహిస్తుంటుంది. ఇది చట్టం మేరకు ఆర్‌బీఐకు ఉన్న బాధ్యతలు. డీ మానిటైజేషన్, కొత్త నోట్ల ఇష్యూ తదితరాలను ఆర్‌బీఐ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దేశంలో పలు పథకాలకు రుణాలివ్వడం కూడా ఆర్‌బీఐ బాధ్యతనే. బ్యాంక్ కస్టమర్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిపై ఆథారిటీగా ఆర్‌బీఐ ఉంటుంది. రకరకాల కేటగిరీల్లో లోన్స్ ఇవ్వడం, బ్యాంకులను అభివృద్ధి చేయడం కూడా ఆర్‌బీ‌ఐ విధులే. ఈ సంగతులు పక్కనబెడితే ఆర్‌బీఐ తాజాగా మాస్టర్ కార్డుల విషయమై కీలక ఆదేశాలు జారీ చేసింది. అవేంటంటే..

ఇటీవల కాలంలో ఆర్‌బీఐ మాస్టర్ కార్డులను నిషేధించాలని సూచించింది. ఈ మేరకు చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్ కార్డుకు తెలిపింది. అయితే, తాజాగా వాటిని పునరుద్ధరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ ప్రకారం..పేమెంట్ వ్యవస్థల డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలని ఆర్బీఐ అన్ని పేమెంట్ సర్వీస్ సంస్థలను 2018 ఏప్రిల్‌లోనే ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు 6 నెలల డెడ్‌లైన్ ఇచ్చింది. అయినా మాస్టర్ కార్డ్ ఆర్‌బీఐ మార్గదర్శకాలను అమలు చేయలేదు. దాంతో ఆర్‌బీఐ ‘మాస్టర్’ కార్డుల జారీని నిలిపివేసింది. ఇదొక్కటే కాదు గతంలో ‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్’ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించగా ఈ సంస్థలపైనా ఆర్‌బీఐ పలు ఆంక్షలు విధించింది. అయితే, తాజాగా నిబంధనలు సడలించి మాస్టర్ కార్డులను మళ్లీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందుకు ఇప్పటికే జారీ అయిన నిబంధనల ప్రకారం మాస్టర్ కార్డు సర్వీసులు కొనసాగించొచ్చు. కొత్త కార్డుల విషయంలోనూ ఇవి వర్తిస్తాయి. అయితే, మాస్టర్ కార్డు ఇష్యూయింగ్‌కు బ్యాంకులు నిరాకరిస్తే వీసా లేదా రూపే ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో అకౌంట్లకు మాస్టర్ కార్డులు గతంలో ఇష్యూ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rbi