ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయాలంటే ఎక్కువగా ఉపయోగించే యాప్ ఏదన్నా ఉంది అంటే అది వాట్సాప్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే వాట్సాప్ ఇప్పుడు తమ కస్టమర్లకు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఎంతో ప్రజాదరణ ఉన్నా వాట్సాప్‌కు అనేక మోడ్‌లు ఇప్పుడు చాలానే అందుబాటులో ఉన్నాయి.అయితే ఈ మాడిఫైడ్, క్లోనింగ్ యాప్‌లను వాట్సాప్ సంస్థలు అధికారికంగా అభివృద్ధి చేయవు అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి.ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్రమాదకరమైన మోడ్‌లలో ఫమవాట్సాప్ కూడా ఉంది.  అయితే ఈ మోడ్ ల వలన డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని వాట్సాప్ ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్స్‌కీ ఒక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

వాట్సాప్ మోడ్‌ అయిన  FMWhatsappలో ఒక ట్రోజన్ మాల్‌వేర్ దాగి ఉందని  ఈ నివేదికలో బయట పడింది. ఈ మాల్వేర్ మీ డివైజ్‌లలో సేవ్ చేసిన పేమెంట్ మెథడ్స్‌ ద్వారా కొన్ని   సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని వినియోగదారులను బలవంతం చేస్తుంది. ఒకవేళ మీరు కనుక అలా చేస్తే మీ ఫోన్ లోని మెసేజ్‌లు, డేటా,ఓటీపీలు అన్ని కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.  అసలు FMWhatsapp అంటే ఏంటంటే ఇది ఒక వాట్సాప్‌ క్లోనింగ్ యాప్.ఆదాయం పెంచుకునే దిశగా ఈ యాప్‌ ప్రకటనలను అందిస్తుంది.

ఇప్పుడు ఈ యాప్ లో ట్రయాడా ట్రోజన్‌ (Triada trojan) అనే మాల్‌వేర్ ఉందని కాస్పెర్స్‌కీ రిపోర్టు తెలిపింది. ఈ ట్రయాడా ట్రోజన్ అనే మాల్వేర్ అవసరం లేని అదనపు ట్రోజన్‌లను డౌన్‌లోడ్ చేసుకునెల యూజర్లను ప్రేరేపిస్తుంది. మనం ఎప్పుడయితే ఈ యాప్ ను మన ఫోన్లో ఉంచుకుంటామో అవి సైలెంట్ గా వాటి పని అవి చేస్తూ ఉంటాయి. మీకు తెలియకుండానే పేమెంట్ సేవలను సబ్‌స్క్రైబ్ చేస్తాయి. అందువల్ల FMWhatsapp అనే వాట్సాప్ మోడ్ యాప్‌ను యూజర్లు ఉపయోగించవద్దని కాస్పెర్స్‌కీ సంస్థ సూచిస్తోంది. అలాగే వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి  ప్లాట్‌ఫాంలలో ఉన్నా యాప్స్ ను మాత్రమే  డౌన్‌లోడ్ చేసుకోవాలని హెచ్చరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: