ఇక్కడ మీరు సమీప ఆధార్ కేంద్రాన్ని ఎలా గుర్తించగలరు? - uidai యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా mAadhaar యాప్‌లో వెళ్లడం ద్వారా సమీప ఆధార్ కేంద్రాన్ని చాలా ఈజీగా కనుగొనవచ్చు. సమీప ఆధార్ కేంద్రం గురించి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి మీరు 1947 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు.
ఇక ఆ కేంద్రంలో మీరు మీ మొబైల్ డేటా నంబర్‌తో మీ ఆధార్ డేటాబేస్ అప్‌డేట్ కోసం అభ్యర్థించే ఫారమ్‌లో అన్ని ముఖ్యమైన సమాచారాన్ని పూరించడం చెయ్యాలి. దరఖాస్తు రుసుముగా రూ .50 చెల్లించి ఇంకా మీరు మీ గుర్తింపును బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది.
మీరు అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత, మీ రిక్వెస్ట్ స్టేటస్ ని చెక్ చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన రిఫరెన్స్ నంబర్ అనేది మీకు అందించబడుతుంది.
ఇక మీ అభ్యర్థన ప్రాసెస్ చేయబడిన తర్వాత, మీరు దానిని ఈజీగా ఉపయోగించవచ్చు. మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను మీ ఫోన్‌లో లేదా mAadhaar యాప్‌లో యాక్సెస్ చేయడానికి కొత్త రిజిస్టర్డ్ నంబర్ యాడ్ చెయ్యడం అనేది అవసరం.. ఇక ఈ సింపుల్ స్టెప్స్ తో ఆధార్ కార్డు లో మీ మొబైల్ నెంబర్ ని ఈజీగా అప్ డేట్ చేసుకోవచ్చును..