దేశ వ్యాప్తంగా భారీగా బొగ్గు నిల్వలు తగ్గి పోయాయి. సొంతం గా  విద్యుదుత్పత్తి చేద్దామనుకుంటే బొగ్గు కొరత. పోని బయట నుంచి కొందామంటే ధరల కోత. ఏతా వాతా తేలిందేమిటంటే చీకట్ల కు సిద్ధం కావాలి ప్రతి ఒక్కరు అని. బొగ్గు కొరత వల్ల చాలా రాష్ట్రాలు విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. హడావుడిగా భేటీ అయింది. ఓవైపు సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు విద్యుత్ సంక్షోభం ఏర్పడబోతుందంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండిస్తోంది . అనవసర భయాలే అంటుంది. సరిపడా వనరులు అందుబాటులో ఉన్నాయని, కంగారు అవసరం లేదని అంటుంది. అసలు అది నిజమా కాదా? అదే నిజమైతే రాష్ట్రాలు ఎందుకు  గగ్గోలు పెడుతున్నాయి.

అధికారులు ఎందుకు విద్యుత్ సేవింగ్ సలహాలు ఇస్తున్నారు. ఏపీలో పవర్ కట్స్ ఎందుకు?  కేంద్రం   ఇన్ని మీటింగులు ఎందుకు?  చీకటిని తలచుకుని భయపడుతున్న ప్రతి ఒక్కరి మెదళ్లను తొలిచేస్తున్నటువంటి ప్రశ్నలివి. తమ రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని  మహారాష్ట్ర, రాజస్థాన్,తమిళనాడు, ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయి. దేశంలో 135 ధర్మల్ ప్లాంట్లు మునుపెన్నడూ లేనంత బొగ్గు నిల్వల  కొరతను ఎదుర్కొంటున్నాయని, విద్యుత్ కొరత తప్పదని సాక్షాత్తు భారతీయ కేంద్ర విద్యుత్  అథారిటీ డేటానే చెబుతుంది. దేశవ్యాప్తంగా అవసరమైన విద్యుత్ ను 70 శాతాన్ని ఇవే ఉత్పత్తిచేస్తాయి. బొగ్గు నిల్వల తీవ్ర కొరత కారణంగా ఈ 135 ధర్మల్ ప్లాంట్లను  106 అంటే దాదాపు 80 శాతం ప్లాంట్లు సంక్షోభం లేదా అతి తీవ్ర సంక్షోభ పరిస్థితిలో ఉన్నాయి. సాధారణంగా 14 రోజులకు సరిపడా నిల్వలు ఉంటాయని భారత ప్రభుత్వం మాట.

కానీ ఇప్పుడు రెండు రోజులకు మించి  లేవు. బొగ్గు కొరత కు విద్యుత్ సంక్షోభానికి దారులు పడుతున్నాయి. అసలు ఇప్పటికిప్పుడు బొగ్గు కొరత కు కారణం ఏంటి ?, కేంద్ర కేబినెట్ హడావుడి భేటీ వెనుక వ్యూహం ఏంటి ?, ఇదంతా సరే బొగ్గు కొరత తీర్చడానికి ఉన్న మార్గాలు ఏంటి?, సంక్షోభ వేళ కొత్త విద్యుత్ చట్టం తీసుకురాబోతున్నారా? సంక్షోభం వేళ ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: