అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు PAN కార్డ్ అనేది అత్యంత ముఖ్యమైన పత్రం. ఇది 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ పాన్ నంబర్‌తో వస్తుంది. దీనిని ఉపయోగించకుండా ఆర్థిక లావాదేవీలు జరగవు. పాన్ కార్డ్ అనేది ఒక వ్యక్తి లేదా కంపెనీల పన్ను బాధ్యతను అంచనా వేయడంలో అవసరమైన అన్ని ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడంలో ఆదాయపు పన్ను అథారిటీకి సహాయపడే ముఖ్యమైన పత్రం, ఇది పన్ను ఎగవేత అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది. PAN కార్డ్ హోల్డర్‌లు మార్చి 31, 2022లోపు తమ పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN)ని ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ చేయాలని సూచించారు. ఈ గడువులోపు మీరు మీ PANని ఆధార్‌తో లింక్ చేయకుంటే, మీ PAN కార్డ్ డియాక్టివేట్ చేయబడవచ్చు. గడువు ముగిసిన తర్వాత పాన్‌ను ఆధార్‌ కార్డ్ తో లింక్ చేసినట్లయితే మీరు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఇక అంతేకాకుండా అలా చేసిన వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్‌లు, ఓపెన్ బ్యాంక్ ఖాతాలు ఇంకా అలాగే పాన్ కార్డ్‌ను సమర్పించాల్సిన అవసరం ఉన్న ఇతర వాటిలో పెట్టుబడి పెట్టలేరు.


ఇంకా అలాగే ఆ వ్యక్తి ఇకపై చెల్లుబాటు కాని పాన్ కార్డ్‌ని ప్రొడ్యూస్ చేస్తే, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272N ప్రకారం, అటువంటి వ్యక్తి రూ. 10,000 జరిమానా చెల్లించాలని అసెస్సింగ్ అధికారి ఆదేశించడం జరిగింది.అందుకే SMS ద్వారా చాలా ఈజీగా పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేయవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.ఇక ముందుగా మీరు మీ ఫోన్‌లో UIDPAN అని టైప్ చేయాలి. దీని తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. ఆపై 10 అంకెల పాన్ నంబర్‌ను కూడా నమోదు చేయండి. ఇప్పుడు ఆ మెసెజ్ ని 567678 నెంబర్ కి లేదా 56161నెంబర్ కి పంపిస్తే మీ పాన్ కార్డ్ చాలా ఈజీగా మీ ఆధార్ కార్డ్ తో లింక్ చేయబడుతుంది. కాబట్టి ఇలా పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చెయ్యండి.10 వేల రూపాయలు పెనాల్టీ పడకుండా జాగ్రత్త పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: