
చూడ్డానికి ఎంతో సింపుల్ గా ఉన్నాడు కదా ఇక వృద్ధాప్యం వరకు కష్టపడి ఇక ఇప్పుడు మనవళ్ళు మనవరాళ్లతో ఎంతో సంతోషంగా హాయిగా రెస్ట్ తీసుకుంటూ కడుపుతు ఉన్నట్లు కనిపిస్తుంది కదా. మీరు అలా అనుకున్నరంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే అతను ఈ వయసులో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అదేలా ఈ వయసు లక్షల సంపాదించడం ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా.. అతను ఎంతో తెలివితో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు.. ఇలా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని ఎంతోమంది స్టాక్ మార్కెట్ ద్వారా నష్టపోయిన వారి గురించి కథలు కథలుగా చెప్పుకోవచ్చు.
అదే సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఊహించని రీతిలో సంపాదిస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఈ ఓవర్ నైట్ ఇన్వెస్టర్ స్టార్ గురించి పెద్దగా వివరాలు బయటకు రాలేదు. కానీ ఆయన పెట్టిన పెట్టుబడులు ఆస్తులు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాజీవ్ మెహతా అనే నేటిజన్ ఈ పెద్దాయన గురించి ఒక వీడియో తీశాడు. ఈ వీడియోలో ఆ పెద్దాయన కోట్ల ఆస్తులు ఉన్న సాధరణ జీవితం గడుపుతున్నాడని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయనకు ఏ కంపెనీలో షేర్లు ఉన్నాయో వివరించారు. అయితే సదరు పెద్దాయన నికర ఆస్తి 10 కోట్లకు పైగానే. ఆ వ్యక్తి నేలకు సుమారు 6 లక్షల డివిడెండ్లను సంపాదిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.