ఇక మార్చి మొదటి రోజే సామాన్య ప్రజలకి కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చాయి ఆయిల్‌ కంపెనీలు. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. ఈరోజు అనగా మార్చి 1, 2024న ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరిగింది.ఇక అదే సమయంలో ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.26 పెరిగింది. మొత్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1795, కోల్‌కతాలో రూ.1911, చెన్నైలో రూ.23.50 ఇంకా ముంబైలో రూ.1749గా మారింది. గత నెల ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ రోజున కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని రూ.14 పెంచారు. అయితే దేశీయంగా 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం కంపెనీలు పెంచలేదు. 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50 ఇంకా చెన్నైలో రూ.918.50గా ఉంది.గత సంవత్సరం డిసెంబర్ 2023లో 19 కిలోల బరువున్న గ్యాస్ సిలిండర్‌పై రూ.21 పెంచారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2024లో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.14 పెరిగింది. ఇప్పుడు మార్చి 2024లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర వచ్చేసి రూ. 25 పెరిగింది.


ఇక మూడు నెలలను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో సిలిండర్ పై రూ.60 పెరిగింది.అయితే గృహ వినియోగదారులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. సబ్సిడీ 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ ధరలో ప్రస్తుతం ఎలాంటి పెరుగుదల అనేది లేదు. దీంతో వినియోగదారుల జేబుపై ఎలాంటి ప్రభావం ఉండదు. గత నెలలో దేశీయ గ్యాస్ ధరలు తగ్గాయి. డిసెంబర్ నుంచి మార్చి దాకా జనవరి మినహా 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు మొత్తం రూ.60 పెరిగాయి. అంతకు ముందు వినియోగదారుల జేబులకు చిల్లు పడింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. ప్రస్తుతం వినియోగదారులు హోటళ్లకు వాడే ఈ సిలిండర్‌ కోసం ఎక్కువ డబ్బుని చెల్లించాల్సి వస్తోంది.ఈ వాణిజ్య గ్యాస్ ధర ప్రత్యక్ష ప్రభావం ఆహార పరిశ్రమపై కనిపిస్తుంది. హోటల్, ఫుడ్ డెలివరీ కూడా ఖరీదైనవి. అందువల్ల రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగాయి. అందుకే సామాన్యులు ఇప్పుడు బయటి ఆహారానికి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: