మాంసాహారం ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా తినేది చికెన్. అలాగే ఈ చికెన్ తో ఎన్నో వెరైటీ రకాల కూరలు వండవచ్చు తెలుసా.. !! ఎప్పుడు వండేలాగా చికెన్ కూర వండితే ఏమి బాగుంటుంది.. అందుకే ఈసారి కాస్త వెరైటీ గా ట్రై చేయండి.. చికెన్ లో బటర్ వేసి కర్రీ వండితె చాలా రుచికరంగా ఉంటుంది తెలుసా.. బటర్ అంటే అంటే మనందరికీ ఇష్టమే… నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. అలాంటి బటర్ తో చికెన్ వంట చేసుకుంటే మామూలుగా ఉండదు.అలాగే ఈ రెసిపీకి పెద్ద సమయం ఏమి పట్టదు. త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు  ఈజీగా అదిరే టేస్టుతో బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలిసిన పదార్ధాలు ఏంటో తెలుసుకుందాం.. !!

కావలసిన పదార్ధాలు :

బోన్ లెస్ చికెన్ – 1/4 కేజీ
ఉప్పు – సరిపడా
మిరియాలపొడి – 1/2 టీ స్పూన్
కారం – 2 టీస్పూన్లు
పసుపు – 1 1/2 టీస్పూన్
బటర్ – 6 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ – 1 1/2 కప్పు
గరం మసాలా – 3 టీస్పూన్లు
అల్లం – 1 టేబుల్ స్పూన్
లవంగాలు – 3
దాల్చిన చెక్క – ఒక పెద్ద ముక్క
టమాటా ప్యూరీ – 3 కప్పులు
హెవీ క్రీమ్ – 1 కప్పు

తయారుచేయు విధానం :

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి,  చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి,  ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి వేడయ్యాక చికెన్ ముక్కల్ని వెసి బాగా కలపాలి. చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయాక వేగిన ముక్కలను వేరే గిన్నెలోకి తీసుకోవాలి.  ఇప్పుడు మళ్లీ అదే పాన్ లో మరో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వెసి వేయించాలి. వెంటనే గరం మసాలా, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా వేగాక టమాటా ప్యూరీ వేసి పచ్చి వాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో ఒక కప్పు నీరు పోసి కలిపి  ముత పెట్టాలి.. 5  నిముషాలు అయ్యాక ముందుగా బటర్ లో వేయించి పెట్టుకున్న చికెన్  ముక్కలు వెసి కలిపి 10-15 నిమిషాలపాటూ సిమ్‌లో ఉడికించాలి.  తర్వాత మిగిలిన 2 టేబుల్ స్పూన్ల బటర్ కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే బటర్ చికెన్ రెడీ అయినట్లే..ఇంకెందుకు ఆలస్యం వెంటనే వండేసి రుచి చూసేయండి మరి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: