ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పన్నీర్ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక పన్నీర్ తో మనం రుచికరమైన స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. పన్నీర్ తో చేసే స్వీటుల్లో గులాబ్ జామ్ ఎంతో రుచికరంగా ఉంటుంది. పన్నీర్ తో చేసే స్వీటుల్లో గులాబ్ జామ్ కూడా ఒకటి. మామూలు గులాబ్ జామున్లతో పోలిస్తే... పన్నీర్ గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటుంది. దీని కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. చాలా సులువుగానే చేసుకోవచ్చు.

పన్నీర్ గులాబ్ జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు:

పన్నీర్ గులాబ్ జామున్
పాలపొడి - రెండు కప్పులు,
రవ్వ - రెండు టీస్పూనులు,
గుడ్డు - ఒకటి,
పనీర్ తురుము - ఒక కప్పు,
పంచదార - ఒక కప్పు,
నీళ్లు - రెండు కప్పులు,
బేకింగ్ సోడ: పావు స్పూను,
నూనె - వేయించడానికి సరిపడా

పన్నీర్ గులాబ్  జామున్  తయారుచేయు విధానం......

ముందుగా ఒక గిన్నెలో రవ్వ, పన్నీరు తురుము, పాలపొడి వేసి కలపాలి. అందులో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పేస్టులా చేసుకోవాలి. పది నిమిషాలు పక్కన వదిలేయాలి. ఈ లోపు స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు, పంచదార వేసి పాకం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మరో గిన్నె పెట్టి అందులో నూనె వేయాలి. ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పన్నీరు మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. వాటిని కాగిన నూనెలో వేసి వేయించాలి. గోల్డ్ బ్రౌన్ రంగులోకి మారాక తీసి... పంచదార పాకంలో వేయాలి. అందులో ఓ అరగంట పాటు ఉంచి తీసి సర్వ్ చేయాలి. టేస్టీ పన్నీరు గులాబ్ జామూన్లూ నోరూరిస్తాయి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: