ఈరోజు ఇండియా.. ఇంగ్లాండ్ జట్లమధ్య మ్యాచ్ జరగబోతున్నది.  ఈ మ్యాచ్ భారత్ కంటే ఇంగ్లాండ్ కు కీలకం.  టాప్ ఫెవరెట్ జట్టుగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మొదట్లో ప్రత్యర్ధి జట్లపై విరుచుకుపడింది.  తప్పకుండా టైటిల్ ఫెవరేట్ గా ఉంటుందని అనుకున్నారు. 


ఈరోజు జరిగే మ్యాచ్ ఇంగ్లాండ్ కు కీలకం.  ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తప్పనిసరిగా గెలవాలి.  ఇండియాతో జరిగే ఈ మ్యాచ్ తో పాటు అటు న్యూజిలాండ్ తో జరగాల్సిన మ్యాచ్ లోను ఇంగ్లాండ్ గెలవాలి.  ఈరోజు ఇండియా చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోతే.. పాక్ సెమిస్ కు ఆశలు నిలబడతాయి.  


ఇంగ్లాండ్ గెలిస్తే.. పాకిస్తాన్ సెమిస్ ఆశలు సన్నగిల్లుతాయి. ఈరోజు మ్యాచ్లో భారత్‌ గెలిస్తే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధాలు లేకుండా భారత్‌ సెమీస్‌ చేరుతుంది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ కు అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. 8 పాయింట్లే ఉన్న ఆ జట్టు సెమీస్‌ చేరాలంటే చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలవాలి. దానికి తోడు బంగ్లాదేశ్‌.. భారత్‌ చేతిలో ఓడి పాకిస్థాన్‌పై విజయం సాధించాలి. శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా పరాజయం పాలవ్వాలి.


9 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్‌ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే చాలు సెమీస్‌ చేరుతుంది.  భారత్‌, పాకిస్థాన్‌లను ఓడిస్తే బంగ్లాదేశ్‌ ముందంజ వేస్తుంది. శ్రీలంక చివరి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌, భారత్‌పై విజయం సాధించాలి. దానికి తోడు మిగతా ఫలితాలు అనుకూలంగా ఉండాలి. బంగ్లాదేశ్‌.. భారత్‌ చేతిలో ఓడి.. పాకిస్థాన్‌పై గెలవాలి. ఇంగ్లాండ్‌ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలి.


ఒకవేళ ఈరోజు ఇంగ్లాండ్ విజయం సాధిస్తే.. ఇంగ్లాండ్‌ అవకాశాలు మెరుగవుతాయి. న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఆ జట్టు సెమీస్‌ చేరుతుంది. ఈరోజు ఇండియా ఓడినా..  శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లో ఒక్కటి గెలిచినా ముందంజ వేస్తుంది. ఒకవేళ ఆ రెండు ఓడినా మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌ చేరే అవకాశముంది.

ఇప్పటికే 9 పాయింట్లతో ఉన్న ఆ జట్టు సెమీస్‌ చేరాలంటే చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను తప్పక ఓడించాలి. ఇంగ్లాండ్‌ కూడా న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోవాలి.  భారత్‌, పాకిస్థాన్‌లను ఓడిస్తే బంగ్లాదేశ్‌ ముందంజ వేస్తుంది. కాకపోతే ఇంగ్లాండ్‌ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది.  శ్రీలంక చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా అవకాశాలు దాదాపుగా లేనట్లే.. ఎందుకంటే ఆ జట్టు రన్‌రేట్‌ హీనంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: