నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైంది. ఇక చాల మంది సెల్ఫీ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చెరువుల్లో, నదులు, ఎత్తైన ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకోవడం, ఆ ఫొటోలను నెట్టింట తమ ఖాతాల్లో పోస్ట్ చేయడం, వాటికి వచ్చే లైకులు, కామెంట్స్, షేర్లను చూసి తెగ మురుసిపోవడం. ఇదే ప్రస్తుతం మెజారిటీ యూత్ చేస్తున్న పని.