పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నలంద జిల్లాలోని ద్వారకా బిగాహా గ్రామానికి చెందిన యువతికి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. వరుడి కుటుంబ సభ్యులకు సుమారు 4 లక్షల విలువైన లాంఛనాలను కూడా ముట్టజెప్పారు. మరికొద్దిరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే యువతిని ఎవరో హత్యచేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు. అయితే యువతి మరణానికి వరుడి ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇక ఆ యువతి మిస్సయిన మరుసటి రోజే ఓ గుర్తు తెలియని యువతి శవాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. ఆ మృతదేహం కిడ్నాప్ కు గురి అయిన యువతిదేనని పోలీసులు తేల్చారు. తల్లిదండ్రులు ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు వచ్చి గుండె నిండా ఆవేదనత కుప్పకూలిపోయారు. కారణం, ఆ మృతదేహానికి తల లేదు. అత్యంత కిరాతకంగా ఆ యువతి కాళ్లు, చేతులను కట్టేసి మరీ ఆ యువతి తల నరికేశారు. దారుణంగా చంపేశారు. తలలేని ఆ యువతి శవాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.
పోలీసులు మిస్సింగ్ కేసును కాస్తా మర్డర్ కేసుగా మార్చి విచారణ చేపడుతున్నారు. కాగా, ఆజాద్ వల్లే తమ కుమార్తె తమకు దక్కకుండా పోయిందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆజాద్ కు గతంలో వేరే అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని చెబుతున్నారు. తమ కుమార్తెతో పెళ్లి నచ్చని ఆ యువతి తరపు వాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని వాళ్లు అనుమానిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి