నేటి సభ్యసమాజంలో బ్రతుకుతుంది మనుషులా.. మానవ మృగాలా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే మాత్రం సభ్య సమాజంలో ఉంది మనుషులు అని ఎవ్వరూ చెప్పలేరు.  క్రూర మృగాలు అయిన మనుషుల కంటే మానవత్వం గా వ్యవహరిస్తాయేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూస్తుంటే.  అమానుషం, దారుణం, పాశవికం ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలకు తక్కువే. మనుషులే సాటి మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదు.  ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు విషయంలో  తల్లిదండ్రులు ఇటీవలికాలంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది.



 ఒకప్పుడు అనుకునేవారు..  ఆడపిల్ల పుట్టవద్దు మగపిల్లాడే పుట్టాలి అని..  కాని నేటి ఈ రోజుల్లో మాత్రం నాగరిక సమాజంలో అలాంటి అవకతవకలు ఎక్కడ చూపించడంలేదు. ఆడపిల్ల పుట్టిన మగ పిల్లాడు పుట్టిన ఆనందంగా స్వీకరిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ ఇంకా నేటి నాగరిక సమాజంలో కూడా అనాగరిక ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆడపిల్ల పుడితే అక్కర్లేదు అనుకునే తల్లిదండ్రులు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు.  ఆడపిల్ల పుడితే ఇక చివరికి ముక్కుపచ్చలారని చిన్నారిని ముళ్లపొదల్లో పడేయటం లేదా అంతం చేయడం లాంటి ఘటనలు ఇప్పటికీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.



 అప్పుడే పుట్టిన శిశువు ను బ్రతికుండగానే పాతిపెట్టారు తల్లిదండ్రులు. ఈ అమానుష ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లో వెలుగులోకి వచ్చింది. నందిగాం మండలానికి చెందిన ఓ మహిళ ఏడో నెల లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలోనే  ఆమెకు డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అయితే ఆడబిడ్డ పుట్టింది అని డాక్టర్లు చెప్పారు. దీంతో పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ విషయంలో కూడా కన్న తీపి మరచి పోయింది ఆ తల్లి. ఆడపిల్ల పుట్టింది అని చెప్పగానే శిశువును కననం  చేసేందుకు ఓ వ్యక్తిని కూడా పురమాయించింది. గుట్టు చప్పుడు కాకుండా ఆ తల్లి ఒడిలో శిశువును తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఇక దూరంగా ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని బ్రతికుండగానే పాతి పెట్టాడు. ఇక ఆ సమయంలో ఫోటోలు వీడియోలు తీశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: