టెక్నాలజీ పెరిగింది. కాలంలో మార్పు కూడా వచ్చింది. భారతదేశం అభివృద్ధిలో ముందుకు వెళుతోంది. ఎంతోమంది ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ  కొత్త కొత్త  పనులను చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా పని చేయాలంటే కేవలం పురుషులకు మాత్రమే హక్కు ఉండేది. స్త్రీలు  వంట ఇంటికే పరిమితం అయ్యేవారు. కానీ ప్రస్తుత కాలంలో మహిళలు కూడా  పురుషులతో సమానంగా దేనిలో తక్కువ కాదంటూ పోటీ పడుతున్నారు. అంతరిక్షంలోకి సైతం వెళ్లి వస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఎవరెస్టు శిఖరం సైతం  అధిరోహిస్తూ తమ మహిళా పతాకాన్ని ఎగరేస్తున్నారు. దేనిలో తక్కువ కానీ మహిళలపై కొన్నిచోట్ల పురుషాధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. చాలాచోట్ల మహిళలు దాడులకు గురవుతున్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా. ఎన్ని శిక్షలు విధించినా మార్పు మాత్రం రావడం లేదని చెప్పవచ్చు. కట్నాల కోసం వేధింపులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో జరిగింది.

 వారికి వివాహమై 12 సంవత్సరాలు అవుతుంది. సంసార జీవితం సాఫీగా సాగుతోంది. ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో..ఆ కసాయి భర్త ఆమెను తరచూ వేధింపులకు గురి చేసి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. దేనికోసం హింస తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే అదనపు కట్నం ఇవ్వాలని వేధిస్తున్న టువంటి భర్త, ఆమె అత్తామామలు పై కరీంనగర్లోని సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం జగిత్యాల జిల్లాలోని రూరల్ మండలానికి  సమీపంలో ఉన్న  గోపాల్ రావు పేట గ్రామానికి చెందినటువంటి   సుమలతకు సారంగాపూర్ మండల కేంద్రంలోని  పెంబట్ల గ్రామానికి చెందినటువంటి మిరియాల మహేష్ తో 12 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఈ పెళ్లి సమయంలో  వరుడు మహేష్ కు సుమలత తల్లిదండ్రులు వారు ఒప్పుకున్న  మొత్తం వరకట్నాన్ని అప్పుడే అప్పజెప్పారు. అయితే ఆ ఇద్దరి దంపతులకు ఇద్దరు కొడుకులు జన్మించారు.

 అయితే ఈ మధ్యనే  మహేష్ సుమలతను  మళ్లీ అదనంగా  ఒక మూడు లక్షల రూపాయలు కట్నం తీసుకురావాలని భర్త మహేష్, అత్త పోశవ్వ, మామయ్య లక్ష్మీనారాయణ సుమలతను మానసికంగా, శారీరకంగా  వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో విసుగు చెందిన సుమలత  వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: