తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న నాటినుండి వారి అరాచకాలకు హద్దులు లేకుండా పోయాయి. మతం పేరుతో సామాన్యులను , పేదప్రజలు హింసిస్తున్నారు. మతం కట్టుబాట్లు కారణంగా ఓ మహిళా  వాలీబాల్ క్రీడాకరిణి తల నరికి చంపిన దురాగతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయం తెలిసి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. ఈ విషయాన్నీ అండర్-19  టీమ్ కోచ్  సురయా అఫ్జలీ తెలిపే వరకు ఎవరికి ఈ విషయం తెలియదు. తాలిబన్ల అరాచక పాలనలో ఇలాంటి దురాగతాలు , మనవాహననాలు ఎన్నెన్నో ఉన్నాయ్. 
IHG    మహబజిన్ హకీమి  అనే ఆఫ్ఘనిస్తాన్ అండర్-19  టీమ్ వాలీబాల్  ప్లేయర్ తలను తాలిబన్ లు అతి కిరాతకంగా నరికి చంపారు . నరికిన తరువాత ఆమె తలను పాశవికంగా దూరం గా విసిపారేసారు అని ఆమె తెలిపింది కానీ ఆమె ఎందుకు తాలిబన్లు ఆలా చేశారో వివరణ ఇవ్వలేదు. ఈ విషయాన్నీ బయటకు తెలిపితే మహబజిన్  కుటుంబాన్ని చంపేస్తామని బెరించారని ఆమె తెలిపింది. ఆ కారణం చేతనే తాను ఈ విషయాన్నీ బయటపెట్టలేదని తెలిపింది. మహబజిన్.. అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నుండి దిగిపోయే ముందు  కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్  లో ఆడేది.  పైగా మే  వాలీబాల్ క్లబ్ లో  ఆమె గొప్ప ప్లేయర్ .

IHG

 మహబజిన్ హకీమి ని చంపే ముందు మరో ఇద్దరు మహిళా ఆటగాళ్లు .. తాలిబన్ల నుండి తప్పించుకోగలిగారు అని ఈ సందర్భగా ఆమె కోచ్  సురయా అఫ్జలీ తెలిపింది. మహబజిన్ హకీమి గనుక దేశం విడిచి పోయి ఉంటె కచ్చితంగా ఆమె ఈ రోజు బ్రతికి ఉండేదని ఆమె తన ఆవేదన వ్యక్త చేశారు. అయితే ఇంకా తాలిబన్ల దృష్టిలో మరికొంతమంది పై ద్రుష్టి ఉండటంతో మహిళా ఆటగాళ్లు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. తాలిబన్ ల ఆగడాలను నియంత్రించడానికి ప్రపంచదేశాలు నడుంబిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనిషి ప్రాణాలను మత పిచ్చితో హరిస్తున్న మానవ మృగాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ప్రపంచ దేశాలపై ఉంది .


మరింత సమాచారం తెలుసుకోండి: