మహిళల రక్షణ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఎక్కడ చూసినా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. బయటి వ్యక్తుల నుంచి సొంత వారి నుండి  మహిళలు అడుగడుగునా లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇటీవల కాలంలో అయితే మంచి వాళ్ల ముసుగులో బ్రతుకుతున్న ఎంతో మంది తోనే ఆడపిల్లలకు ప్రమాదం పొంచి ఉంటుంది. తాము మంచి వాళ్ళని ముసుగు వేసుకొని మాయమాటలతో నమ్మించడం.. ఇక ఆ తర్వాత సమయం కోసం ఎదురు చూసి అసలు రంగు బయట పెట్టి లైంగిక వేధింపులకు పాల్పడడం, అత్యాచారాలు చేయడం లాంటివి చేస్తున్నారు ఎంతోమంది మానవమృగాలు.


 దీంతో నేటి సభ్య సమాజంలో ఆడపిల్ల ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. రోజురోజుకు వెలుగులోకి వస్తున్నా ఘటనలు చూస్తుంటే  ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేదు అన్నది అర్ధమవుతుంది. ఆడ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఎన్నో కఠిన చట్టాలను తీసుకు వస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ ఈ కఠిన చట్టాలు కామాంధుల తీరులో మాత్రం మార్పుతీసుకు రాలేకపోతున్నాయ్. అయితే ఇటీవల కాలంలో అయితే ఎంతో మంది ప్రేమ అనే ముసుగులో ఆడ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణఖేడ్ మండలం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది 17 ఏళ్ల యువతి. ఇక అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న వ్యక్తి ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ యువతిని మాయ మాటలతో నమ్మించాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కార్ ఎక్కించుకుని వెళ్లి మన్పూర్ కూడలి వద్దకు రాగానే అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అయితే చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఇది గమనించి ఇక కారును వెంబడించారు. దీంతో యువతిని అక్కడే వదిలేసిన ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: