ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద ఎక్కువైపోతుంది. సమాజంలో ఎంతో గౌరవంగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని బతకడం కంటే ఇక దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలా జల్సాలకు డబ్బులు సరిపోక దొంగలుగా మారుతున్నారు కొంతమంది అయితే.. కరోనా వైరస్ సమయంలో ఉపాధి కోల్పోయి కుటుంబం బాధ్యతలు భారంగా మారిపోయి దొంగలుగా మారుతున్న వారు ఇంకొంత మంది. ఏదేమైనా దొంగల బెడద మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది.


 పోలీసులకు దొరకకుండా ఎంతో పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడుతున్నారు దొంగలు. ఇలా ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే సాధారణంగా ఎవరైనా దొంగ కనిపించాడు అంటే మహిళలు ఎంతగానో భయపడిపోతుంటారు. పెద్దగా అరిచింది చుట్టుపక్కల వాళ్ళని పిలవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. లేదంటే భయంతో వెళ్లి ఎక్కడో ఓ చోట దాక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ మహిళలు ఎదురు తిరగడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఓ మహిళ ఇలాంటి ధైర్యసాహసాలను ప్రదర్శించి  ఔరా అనిపించింది.


 కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తికి మహిళా ఊహించని షాక్ ఇచ్చింది.. బైక్ పై వచ్చిన ఒక వ్యక్తి కస్టమర్ లాగానే కిరాణా దుకాణం కి వెళ్లి మహిళకు  సరుకులు ఇవ్వాలి అంటూ ఒక లిస్ట్  ఇచ్చాడు. ఈక్రమంలోనే కిరణా షాప్ లో ఉన్న మహిళ సరుకులు ఇస్తున్న సమయంలో తన వెంట తెచ్చుకున్న కారాన్ని మహిళ కళ్ళల్లో కొట్టి మెడలో మంగళసూత్రాన్ని లాక్కు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఇది గమనించిన పక్కనే ఉన్న మహిళ ఏకంగా దొంగని పట్టుకొని ఇక దొంగ చేతిలో ఉన్న కారాన్ని అతని కళ్ళల్లోనే చెల్లి చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది. చివరికి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి దొంగను పోలీసులకు అప్పగించారు. ఇక సదరు మహిళ ధైర్యసాహసాలపై అందరు ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: