జీవితం మొత్తం ఎంతో సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు జీవితాన్ని విషాదంలోకి నెడుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కట్టుకున్న భార్యపై పరాయి వ్యక్తి చూపు పడితేనే భర్త అస్సలు తట్టుకోలేడు. కానీ ఇటీవలే ప్రాణం కంటే ఎక్కువగా భావించిన భార్య వేరే వ్యక్తితో అసభ్యకరంగా ఉండటాన్ని చూసినా భర్త తట్టుకోలేకపోయాడు. ఇక తన భార్య కు సంబంధించిన ఎన్నో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో ఇక ఇవన్నీ చూసిన భర్త గుండె పగిలిపోయింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య నన్ను మోసం చేసిందా.. ఇక నా జీవితం మొత్తం వృధానేనా నేను ఎవరికోసం బ్రతకాలి అని తనలో తానే కుమిలిపోయి ఎంతగానో మనస్థాపానికి గురయ్యాడు.

 చివరికి ఈ భూమ్మీద బతకడం వృధా అని నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ తాను లేకపోతే పిల్లలు ఏమై పోతారో అని భావించి చివరికి గుండెను మరింత కఠినం గా మార్చుకున్నాడు. ఏకంగా అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు విషం తాగించి తాను కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు సదరు వ్యక్తి. ఇక ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనం గా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ దారుణ ఘటన. వంగలపూడి కి చెందిన 30 ఏళ్ల మహిళ ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లి పోయింది.


 ఇక భర్త ప్రస్తుతం గోకవరం లో ఉంటూ పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో భార్య మరో వ్యక్తితో అసభ్యం గా ఉన్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో తట్టుకోలేకపోయాడు భర్త. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకునేందుకు ఎలకల మందు తాగి ఆ తర్వాత ముగ్గురు పిల్లలకు తగ్గించే ప్రయత్నం చేయగా.. పదేళ్ళ కొడుకు తాగాడు. కానీ ఇద్దరు పిల్లలు తాగడానికి భయపడ్డారు.. స్థానికులు  గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: