ఇటీవలి కాలంలో ఎంతో మంది యువతీ యువకులు తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు అన్న కారణంతో పగ పెంచుకుని ఏకంగా సొంత తల్లిదండ్రులని దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా సొంత వాళ్ల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించకుండా విచక్షణ కోల్పోయి హత్యలకు పాల్పడి చివరికి జైలు పాలవుతున్నారు ఎంతోమంది  ఇలా ప్రియుడి మోజులో పడిపోయి రక్త సంబంధానికి కూడా విలువ ఇవ్వడం లేదు. ఇటీవలే మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విషయంలో అడ్డ అడ్డు చెప్పాడు అన్న కారణంతో చెల్లి చేసిన పనికి చివరికి అభం శుభం తెలియని అన్న ఇద్దరు పిల్లలు కూడా సజీవదహనం అయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

 ఇండోర్లో ఉండే బర్కా అనే మహిళ ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. ఎన్నో రోజుల నుంచి ఇంట్లో తెలియకుండా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ఇక ఇటీవల ఇంట్లో ఆ యువతి ప్రేమ విషయం తెలిసింది. దీంతో తీరు మార్చుకోవాలి అంటూ యువతి అన్న ఆమెను హెచ్చరించాడు. ఇదే విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య తలెత్తిన గొడవ తో ఇక చెల్లి అన్న పై కోపం పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంది. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో ఏకంగా అన్నయ్య గుడిసె కీ నిప్పు పెట్టింది. ఇక ఆ సమయంలో గుడిసెలో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు కూడా సజీవదహనం అయిపోయారు.


 అయితే ఈ ఘటన జరిగిన సమయంలో చిన్నారుల తల్లిదండ్రులు ఇంట్లో లేరని తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకు వచ్చే సమయానికి ఇక గుడిసెలో నిద్రిస్తున్న ఇద్దరు బాలికలు కూడా పూర్తిగా కాలిపోయి మృతిచెందారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇక ఇలా గుడిసెలకు నిప్పు పెట్టిన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాము అంటూ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: