గురువును దైవంగా భావిస్తారు. తల్లిదండ్రులు తర్వాత ఆ స్థానాన్ని గురువుకు ఇచ్చారు. అమ్మానాన్నల దగ్గర నేర్చుకోనెది కేవలం కొద్ది వరకు మాత్రమే కానీ బడిలో గురువు మాత్రం ప్రపంచాన్ని నేర్పిస్తారు. అందుకే ఆయనకు అంత ఇంపార్టెంటేన్స్ ఇస్తారు. అలాంటి బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు రాక్షసులుగా మారుథున్నారు.మంచి బుద్దులు నెర్పాల్సిన మాస్టర్స్ వక్రబుద్ది తో చూస్తున్నారు. గురువు తండ్రి తో సమానం అనే సంగతి మర్చిపోయి కామం తో కొట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లలను అసభ్యంగా తాకడం, మాయ మాటలు చెప్పి కడుపు చేయడం, తర్వాత వేరొకరితో సంబంధం ఉందని తప్పుడు ఆరోపణలు చేయడం లాంటి ఘటనలు ఎక్కువగా కనిపించాయి.


ఇటువంటి వాటిపై పోలీసులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూన్న కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. వక్ర బుద్దితో ఉన్న మాస్టార్ కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.. తన బాధ్యత మరచిన ఉపాధ్యాయుడికి తగిన బుద్ది చెప్పారు.. ఆ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెల్లారు. ఈ ఘటన తో ఒక్కసారిగా ఆ జిల్లా మొత్తం వేడి వాతావరణంగా మారిపొయింది.. తల్లి దండ్రుల కోపానికి పంతులుకు పది లోకాలు కనిపించాయి.


వివరాల్లొకి వెళితే.. తెలంగాణాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కొండాపురానికి చెందిన బీ మహేందర్‌ మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల జడ్పీ ఉన్నత పాఠశాల లో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మహేందర్‌ తరచూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారంతా కూడా అతని ఇంటి వద్దకు వెళ్ళి ఈ విషయం పై అడిగి నిలదీసారు. కానీ అతను ఏమి చెప్పక పోవటంతో అతనికి దేహశుద్ధి చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: