ఆధునిక సమాజంలో అడుగుపెడుతున్న మనిషి తమకు ఆలోచించే శక్తి ఉంది అన్న విషయాన్ని మరిచిపోతున్నారా అంటే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నచూస్తూ ఉంటే అవును అని చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే నేటి రోజుల్లో కనీసం ఆలోచన చేయకుండా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న వారే రోజురోజుకూ ఎక్కువ అవుతున్నారు అనే చెప్పాలి. బాగా చదువుకున్న వారు సైతం ఇలా క్షణికావేశం నిర్ణయాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులను విషాదంలోకి నెడుతున్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. తన మృతికి ఎవరూ కారణం కాదు తానే కారణం అంటూ లేఖ రాసి యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.  బాలాపూర్ మండలం గుర్రం గూడా పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు కొండయ్య అనే వ్యవసాయదారుడు. ఈయనకు కుమారుడు శివ కృష్ణ ఉన్నాడు.  నారాయణఖేడ్ లో మిషన్ భగీరథ పథకం ఏఈగా పని చేస్తున్నాడు శివ కృష్ణ. అయితే ఇటీవలే యువకుడికి ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది.



 ఈ క్రమంలోనే ఇటీవలే గుర్రంగూడ లో ఉన్న సొంత ఇంటికి వచ్చాడు శివకృష్ణ. ఇక రెండు రోజుల తర్వాత కొడుకు తో మాట్లాడటానికి తండ్రి ఫోన్ చేయగా స్పందన లేదు. వెంటనే అనుమానం వచ్చి పెద్ద కుమారుడికి ఫోన్ చేశాడు కొండయ్య. ఇక శివ కృష్ణ సోదరుడు వచ్చి తలుపు కొట్టి చూడగా ఎంతకీ తలుపు తెరవలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇక పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి చూడగా శివకృష్ణ తాడుతో ఉరి వేసుకొని కనిపించాడు. అక్కడే ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. పెళ్లి  ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో ఉంది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: