
ఏకంగా ఈత సరదా చిన్నారుల ప్రాణాలు తీయడం సంచలనం గా మారి పోయింది. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్న నేపథ్యం లో చిన్నారులు సరదాగా స్నానం చేయడానికి వెళ్తూ ఉన్న నేపథ్యం లో ఇక అక్కడే వారి కోసం వేచి చూస్తున్న మృత్యువు చివరికి ప్రాణాలు తీసేస్తూ తల్లి దండ్రులకు అరణ్య రోదన మిగులుస్తుంది. ప్రకాశం జిల్లాలో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. జరుగుమల్లి మండలం అక్కచెరువు పాలెం లో సరదాగా చెరువు లో ఈత కొట్టేందుకు వెళ్లారు ఆరుగురు చిన్నారులు.
కానీ చెరువు లో నీళ్లు ఎక్కువగా ఉండటం తో చివరికి ఆరుగురు చిన్నారులు కూడా నీటిలో మునిగి పోయి మృతి చెందిన ఘటన సంచలనం గా మారి పోయింది. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం తో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇప్పటికే నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. ఇక మరో ఇద్దరు చిన్నారుల డెడ్ బాడీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అని చెప్పాలి. అయితే ఇలా ఒకేసారి ఆరుగురు చిన్నారులు మృతి చెందడం తో అటు చిన్నారుల తల్లి దండ్రులు అరణ్య రోదనగా విలపించిన తీరు ఎంతో మందిని కంటతడి పెట్టిస్తుంది అని చెప్పాలి.