
వెరిసి నేటి రోజుల్లో మనుషులు ప్రాణాలు కు విలువ ఇవ్వకుండా హత్యలకు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ చివరికి సభ్య సమాజం భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా నేటి రోజుల్లో మనిషి ఆలోచిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది.ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సాధారణంగా తల్లి అన్న తర్వాత తన పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా అసలు తట్టుకోలేదు. ఎవరైనా తన పిల్లలకు అపాయం తలపెట్టాలని భావిస్తే అపరకాలిలా మారిపోతూ ఉంటుంది తల్లి.
కానీ ఇక్కడ తల్లికి మాత్రం ఏం కష్టం వచ్చిందో ఏమో ఏకంగా గుండెను రాయి చేసుకుని చేయకూడని పని చేసింది. ముగ్గురు పిల్లలను చెరువులో తోయడమే కాదు తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. నవాబ్ పేట మండలం కాకర్ల పహాడ్ చెరువులో ముగ్గురు పిల్లలతో పాటు తల్లిదూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే పెద్ద కుమార్తె నవ్య చెట్టును పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. కానీ తల్లి రమాదేవితో పాటు ఇద్దరు కవలలు మేఘన,మారుతి మృతి చెందినట్లు స్థానికుల తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.