ప్రపంచం  మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే కొంతమంది మాత్రం అనాగరికత వైపు అడుగులు వేస్తున్నారా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం అవును అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే స్మార్ట్ఫోన్ యుగంలో కూడా ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఎంతో మంది నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే మూఢనమ్మకాలకు పోయి ఏకంగా నరబలులు ఇస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇంకా ఆధునిక యుగంలో కూడా అనాగరికతే కొనసాగుతుందేమో అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.


 ఆర్థికంగా లాభపడతాము అనే ఆశతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక మహిళను దారుణంగా నరబలి ఇచ్చారు. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో వెలుగు చూసింది. మహిళల మృతదేహాలను ముక్కలు చేసి వేరువేరు ప్రాంతాల్లో దహనం చేశారు. వీరికి మరొకరు సహాయం చేయగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కొచ్చికి చెందిన పద్మ అనే యాభై రెండేళ్ల మహిళ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించగా.. మొబైల్ డేటా చూసుకుంటే మహ్మద్ షఫీతో అనేకసార్లు మాట్లాడినట్లు తేలింది.


అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే  నిజాలు మాత్రం వెలుగులోకి వచ్చి పోలీసులను షాక్ కి గురి చేశాయి. తిరువల్లకు చెందిన భగత్ సింగ్ అతని భార్య లైలాకు పద్మను అప్పగిస్తే చివరికి నరబలి ఇచ్చినట్లు నిజాలను ఒప్పుకున్నాడు. అదే సమయంలో గతంలో కూడా రోస్లీ అనే మహిళను ఇలాగే నరబలి ఇచ్చినట్లు షాకింగ్ నిజాన్ని బయట పెట్టాడు. కాగా సదరు దంపతులను అరెస్టు చేసి విచారించగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన దంపతులు ధనవంతులు కావడానికి ఇక ఒక తాంత్రికుడు మాటలు నమ్మి ఇలాంటిది చేసినట్లు తెలిసింది. తాంత్రికుడు చెప్పినట్లు నరబలి ఇచ్చిన ధనవంతులు కాకపోవడంతో మరోసారిప్రయత్నించి ఇక పద్మాను నరబలి ఇచ్చినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: