ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ చివరికి రోడ్డు ప్రమాదాలకు కారకులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. తద్వారా ఇక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇక ఇలా ఎవరైనా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారు అంటే ఇక జనాలు వెనుక ముందు ఆలోచించకుండా వారికి గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఒక ఆర్టీసీ డ్రైవర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.


 వార్నింగ్ ఇచ్చి వదిలేయటం  కాదు ఏకంగా రెచ్చిపోయింది సదరు మహిళ. ఏకంగా ఆర్టీసీ బస్సుకు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తిని అందరి ముందే చెప్పుతో కొట్టింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది అని చెప్పాలి. ఈ ఘటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాత్రి రైల్వే స్టేషన్ ప్రధాన రహదారిలో ఒక మహిళ భర్తతో కలిసి బైక్ పై వెళుతుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ డ్రైవర్ ఇక ఆ ద్విచక్ర వాహనాన్ని ఓవర్టేక్ చేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ బైక్ను దాటేసి ముందుకు వెళ్లెందుకు ప్రయత్నించాడు అని చెప్పాలి.


 దీంతో ఇక బైక్ పై వెళుతున్న దంపతులు కోపంతో ఊగిపోయారు. ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ముందు తమ బైక్ ను ఆపారు ఇక ఆ తర్వాత వెంటనే బైక్ మీద నుంచి కిందికి దిగిన మహిళ ఆర్టీసీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది. దీంతో సహనం కోల్పోయిన సదరు మహిళ డ్రైవర్ను దారుణంగా చెప్పుతో కొట్టింది అని చెప్పాలి. దీంతో అక్కడున్న వారందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. అనంతరం స్థానికులు జోక్యం చేసుకోవడంతో ఇక గొడవ అక్కడికక్కడే సర్దుమనిగింది. ఇక ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: