సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలి అంటే తప్పకుండా ద్విచక్ర వాహనం ఉండాలి. ఇక ఎండ వాన అనే తేడా లేకుండా ప్రయాణం సాగించాలంటే ఇక తప్పనిసరిగా కారు కలిగి ఉండాలి. కానీ మెట్రో నగరాల్లో ఇవేవీ అవసరం లేదు. ఎందుకంటే ఒక క్లిక్ ఇస్తే చాలు ఇంటి ముందు వాలిపోయే క్యాబ్ సర్వీసులు ఎన్నో అందుబాటులోకి ఉన్నాయి. ఓలా, ఉబర్ అంటూ బైక్ దగ్గర నుంచి ఆటో కార్ వరకు అన్ని రకాల సర్వీసులను కూడా అందిస్తూ ఉన్నాయి. దీంతో మెట్రో నగరాల్లో ఉన్న జనాలు ఎక్కువగా ఇక ఇలాంటి క్యాబులపైనే ఆధారపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఎక్కడికి వెళ్లాలన్న ఇక వీటి ద్వారానే ప్రయాణం సాగిస్తూ ఉంటారు.



 ఇటీవల కాలంలో ఇక ఇలాంటి సర్వీస్ల విషయంలో కూడా పోటీ పెరిగిపోయింది. ఓలా, ఉబర్ లాంటి కంపెనీలు అతి తక్కువ ధరకే క్యాబ్ సర్వీస్ లను కస్టమర్లకు అందించేందుకు పోటీ పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇలా కస్టమర్లు తమ వాహనాన్ని ఎక్కడ డామేజ్ చేయకుండా ఉండేందుకు ముందుగా హెచ్చరిక బోర్డులు పెట్టినట్లుగానే.. కస్టమర్లకు కొన్ని విజ్ఞప్తులు చేస్తూ ఉంటారు క్యాబ్ డ్రైవర్లు.  ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తన క్యాబ్ లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి క్యాబ్ డ్రైవర్ ఊహించని షాక్ ఇచ్చాడు.



 ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఢిల్లీలోని ఒక వ్యక్తి ఎక్కిన క్యాబ్ సీటుకు కారులో రొమాన్స్ చేయకూడదు... నో రొమాన్స్ అలౌడ్ ఇన్ థిస్ క్యాబ్ అని రాసి ఉన్న నోటీసు ముందు సీటు వెనకాల అతికించాడు క్యాబ్ డ్రైవర్. అయితే ఆ క్యాబ్లో ఎక్కిన ప్రయాణికుడు చాలా మంచిది నేను నా గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడు క్యాబు ఎక్కను అంటూ చెప్పాడు. తర్వాత సార్ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని క్యాబ్ డ్రైవర్ ప్రశ్నించగా.. డ్రైవర్ అడిగిన ప్రశ్నకి ఇక ఆ కస్టమర్ ఎంతో అవమానంగా ఫీల్ అయ్యాడు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: