సాధారణంగా జనాలు అటు వైద్యులకు ఇచ్చే గౌరవం కరోనా వైరస్ కి ముందు కరోనా వైరస్ తర్వాత అన్న విధంగా మారిపోయింది . ఎందుకంటే.. కరోనా వైరస్ వెలుగులోకి రాకముందు వరకు కూడా వైద్యులకు పెద్దగా గౌరవం ఇచ్చేవారు కాదు జనాలు. వైద్యుడే ప్రత్యక్ష దైవం అని చెబుతున్న ఎవరు వినిపించుకునేవారు కాదు. కానీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇది నిజమే అని నమ్మడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎవరికి వారు స్వార్థంగా ఆలోచించిన సమయంలో అటు డాక్టర్లు మాత్రం జనాలకు వైద్యం అందించేందుకు ముందుకు వచ్చారు.


 వైద్యులు ఇలా తెగించి ముందుకు వేయడం కారణంగానే ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పాలి. ఇక పరిస్థితులు కూడా అదుపులోకి వచ్చాయి. అందుకే కనిపించే ప్రత్యక్ష దైవం వైద్యులే అని నమ్మడం మొదలుపెట్టారు జనాలు. ఈ క్రమంలోనే డాక్టర్లకు మరింత ఎక్కువ గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ కొంతమంది వైద్యులు మాత్రం వైద్యవృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి. ఏకంగా పేషెంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవల బీహార్లో అయితే ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది.



 కడుపునొప్పి ఉంది అని ఒక మహిళ ఆసుపత్రికి వెళ్తే ఏకంగా డాక్టర్లు రెండు కిడ్నీలు మాయం చేశారు. మధురపూర్ కు చెందిన సునీత దేవి కడుపునొప్పి వస్తుందని హాస్పిటల్ కి వెళ్ళింది.  కానీ వైద్యులు మాత్రం రెండు కిడ్నీలు మాయం చేశారు. అనంతరం ఆపరేషన్ చేసిన డాక్టర్ సునీత దేవిని మరో ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే అక్కడ స్కాన్ చేసి చూడగా రెండు కిడ్నీలు లేవు అన్న విషయం బయటపడింది. ప్రస్తుతం సునీత డయాలసిస్ చేసుకుంటూ ప్రాణాలను నిలబెట్టుకుంటుంది. తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: