
ఇంకేముంది నిమ్మకాయలు కుంకుమ పసుపుకు పని చెప్పాడు. ఈ క్రమంలోనే అందరూ పోలీస్ అధికారులు లాగా రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడం లేదా రహదారిని బాగు చేయించడం కాదు.. కాస్త విచిత్రంగా ఆలోచించాడు. ఏకంగా మూఢనమ్మకంతో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే రోడ్డుపై హిజ్రాతో పూజలు చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకున్నారు పైఅధికారులు.
ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నైలోని వనాకారం, మధురవాయల సమీపంలోని రహదారిలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్ఐ పళని సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ఒక హిజ్రాను పోలీసు వాహనంలో అక్కడికి రప్పించి.. రోడ్డు ప్రమాదం జరిగే ప్రాంతంలో పూజలు చేయించాడు. హిజ్రా గుమ్మడికాయ నిమ్మకాయలతో రోడ్డుపై దిష్టి తీసింది. ఇక తర్వాత వాటిని నేలకేసి కొట్టింది. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు అటువైపు నుంచి వెళుతున్న ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అయితే ఇక ఇలా విచిత్రంగా ప్రవర్తించిన ట్రాఫిక్ ఎస్ఐ ని విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.