
వివరాల్లోకి వెళితే అక్కడ స్థానికంగా 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల వయస్సు గల భారతికి జ్వరం రావడంతో మంగళవారం స్థానిక రాధాస్వామి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. బుధవారం కూడా ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని బంధువులు తెలిపారు. అయితే డాక్టరు ఇంజెక్షను ఇచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి దిగజారినట్లు ఆరోపించారు. ఆ దశలో.. తాము ఏమీ చేయలేమని, వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలని సిబ్బంది చెప్పారన్నారు. కానీ, అప్పటికే తమ బిడ్డ మృతిచెందిందని వాపోయారు.
అయితే ఈ విషయం బయటకు తెలిస్తే ఎక్కడ తమకు ఇబ్బంది వుంటుందో అని భావించిన డాక్టర్ మరియు సిబ్బంది ఎవరికీ చెప్పకుండా మృతదేహాన్ని ఆసుపత్రి బయట ఉన్న బైక్ మీద పడేసి సిబ్బంది విసురుగా వెళ్లిపోయారని మృతురాలి కుటుంబం మీడియా వేదికగా తమ గొడుని వెల్ల్బుచ్చుతోంది. ఆసుపత్రి బయట బైకుపై బాలిక మృతదేహం పడున్న దృశ్యాలు వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. మైన్‌పురీ ఘటనపై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని యూపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆరోపణలు వచ్చిన ఆసుపత్రిని సీజ్ చేశామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఈ సందర్బంగా వెల్లడించారు.